News
సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూత
సిని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ కన్నుమూశారు. ఈయన వయసు 85 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1928వ సంవత్సరం జూన్ 24న కేరళలోని పాలక్కాడ్ సమీపంలోని ఇలప్పులలో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. సీఆర్ సుబ్బరామన్‌తో కలిసి దేవదాసు, లైలామజ్నూ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. దేవదాసు సినిమాలోని జగమే మాయ బతుకే మాయ పాటను స్వరపర్చారు. చండీరాణి, సిపాయి చెన్నయ్య తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఈయన మృతి వార్త విని సినీ ప్రపంచం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








